మతమేల గతమేల మనసున్న వాడు – Bombay Theme Song in Telugu

వేటూరి గారు రాసిన కవిత్వాలకు తిరుగు అన్నది వుండదు. ఆయన రచించిన యెన్నో కవిత్వాలలో ఒకటి బొంబాయి చిత్రం లోని “మతమేల గతమేల” అన్న పాత. రహమాన్ సంగీతం తో, ఈ పాత చిత్రం అంతం లో దేశం లో సమయిక్యత వుండాలి అన్న విషయం పై రచించారు వేటూరి గారు. ఆ కవిత్వం:

మతమేల గతమేల మనసున్న వాడు,
హితమేదొ తెలియాలి మనిషైన వాడు,
నీ దేశమే పూవనం. పూవై వికశించనీ జీవితం.


కన్నీట
కడగాలి కులమన్న పాపం,
మత రక్త సింధూరం కడగాలి అరుణం,
గాయాల నీ తల్లికీ, కన్నా!! జో లాలి పాడాలిరా!!

సరిహద్దులే దాటు గాలిలా, ప్రవహించనీ ప్రేమనే హాయిగా,
నదులన్ని కలిసేటి కడలింటిలో, తారల్లు విరిసేటి నింగిలో,
కలలోకి జారేను రాత్రులే, వెలిగించె నవ్యోదయం. ( మతమేల గతమేల )

 

తల ఎత్తి నిలవాలి నీ దెశమూ! ఇల మీదనే స్వర్గమై!!
భయమన్నదే లేని భవితవ్యమూ!! సాధించరా సంభ్రమై!!
ఒక మాట ఒక బాట ఒక ప్రాణమై!! సాగాలిరా ఏకమై!!!


Advertisements